- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ చార్జ్ షీట్‌కు సమాధానమేది.. హరీశ్ రావుపై మహేశ్వర్ రెడ్డి సీరియస్
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యంపై కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన చార్జ్ షీట్ పై మంత్రి హరీశ్ రావు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని కొత్త పేట్ ఫ్రూట్ మార్కెట్ వద్ద టిమ్స్ ఆస్పత్రులు నిర్మిస్తున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందన్నారు.
గతేడాది ఆగస్టులో ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. కానీ సర్కారు ఆస్పత్రుల్లోనే ఎక్కువ కాన్పులు చేశామని మంత్రి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో వైద్యం వికటించి ఇద్దరు బాలింతలు మరణించిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. మండలాల్లో 24 గంటల వైద్య సేవలు, ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏరియా హాస్పిటల్స్ నిర్మిస్తామని అడిగారు. చెప్పారు. జాతీయ వైద్య విధానం ప్రకారం కూడా బడ్జెట్ లో తక్కువ నిధులు కేటాయిస్తున్నారన్నారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టలేకపోయారన్నారు.