- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ ఇంకా సీఎం కొడుకుగానే ఫీలవుతున్నాడు: మధుయాష్కీ
దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమదే విజయం అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. మెజార్టీ సీట్లు తమకే వస్తాయని స్పష్టం చేశారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురి కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రౌండ్‌లోని కేడరంతా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారన్నారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ప్రారంభం కానున్నాయన్నారు.
సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అద్భుతమని, అందుకే లీడర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నుంచి కార్యకర్తలంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారని తెలిపారు. మధుయాష్కీ గౌడ్ మట్లాడుతూ.. నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు హర్షణీయమన్నారు. బీఆర్ఎస్ నాయకులకు అహంకారం ఇంకా తగ్గలేదని, కేటీఆర్ ఇంకా సీఎం కొడుకుగా ఫీలవుతున్నాడని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఇక కనుమరుగేనని స్పష్టం చేశారు.