- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు బీజేపీకి లేదు: కిరణ్ కుమార్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హాక్కు బీజేపీకి లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శలపై ఆయన బుధవారం సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. బండి సంజయ్‌కు మెదడు లేదన్నారు. ఎంపీగా ఉన్నాననే విషయాన్ని మరిచి చిల్లర వేషాలు వేస్తాడన్నారు. అర్థంపర్థం లేని మాటలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టివేస్తాడన్నారు. ఇక ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ షెల్టర్ జోన్‌గా మారిందని, మైనార్టీ ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు.
బండి సంజయ్‌కు అవగాహన లేకపోవడంతోనే ఈ సమస్య అన్నారు. ఢిల్లీ బాస్‌ల ముందు గుర్తింపు పొందడానికి బండి సంజయ్ చేస్తున్న మాటలు అర్థరహితం అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో ఎంఐఎం కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన పార్టీగా ఉండేదని, కానీ బీజేపీ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేసిందన్నారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకే ఎంఐఎంను ప్రోత్సహిస్తున్నారని కిరణ్ఫైర్ అయ్యారు. దేశంలో బీజేపీకి ఎంఐఎం చీకటి మిత్రుడన్నారు. లౌకిక వాదంతో పని చేస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదని మరోసారి నొక్కి చెప్పారు. బండి సంజయ్ మాటలకు అడ్డు అదుపు లేకుంటే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని హెచ్చరించారు.