రేవంత్ రెడ్డి జీవిత చరిత్రలపై సినిమా తీస్తా: బండ్ల గణేష్

by GSrikanth |
రేవంత్ రెడ్డి జీవిత చరిత్రలపై సినిమా తీస్తా: బండ్ల గణేష్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అంగీకరిస్తే ఆయన జీవిత కథతో సినిమా తీస్తానని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి జీవితంలో ఎంతో మంది విలన్‌లు ఉన్నారని.. ఆయన్ను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని బండ్ల గణేష్ అన్నారు. ఇబ్బందులు పెట్టిన చోటే నాయకుడిగా ఆయన అధికారం చేపడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి ఆకలి, కసి, కష్టం, పాలన తెలుసు అని బండ్ల గణేష్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క స్థానం కూడా రాకపోవడం బాధాకరమని బండ్ల గణేష్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story