- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీకు చెడ్డపేరు తేవడం ప్రభుత్వం చేయదు! కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి ‘కరెంట్’ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అయితే, గత కేసీఆర్ సర్కార్ హయాంలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి కమిషన్ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఇటీవల నోటీసులు ఇచ్చింది. విచారణ నిష్పక్షపాతంగా లేదని మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. విచారణలో తన పేరు ఉందని మాజీ సీఎం కేసీఆర్ బాధ పడటంలో అర్థం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అన్ని డిపార్ట్మెంట్‌లలో కేసీఆర్ ప్రమేయం తోనే స్కామ్‌లు జరిగాయని తెలుస్తుందని ఆరోపించారు. తన పేరు బాధనాం చేయడానికి ప్రభుత్వం పని చేస్తుందని అనడం తప్పు అని చెప్పారు. ఆయా శాఖల మంత్రుల ప్రమేయం లేకుండా అన్ని స్కామ్‌లు జరిగాయని త్వరలో తెలుస్తుందని స్పష్టం చేశారు. అయితే, మీకు ఎలాంటి చెడ్డపేరు తేవడం ప్రభుత్వం చేయదని వ్యాఖ్యానించారు. కాగా, ఆద్దంకి దయాకర్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మొదట 6 హామీలు పైనా ప్రభుత్వం ఫోకస్ చేస్తే బాగుంటదని నెటిజన్లు సూచిస్తున్నారు.