- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డిని BJP అధ్యక్షుడు చేశారు.. అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఢిల్లీలో దయాకర్ మీడియాతో మాట్లాడారు. ‘ఇండియా కూటమి’ని విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, కాంగ్రెస్ అనుకూల పార్టీల నేతలే టార్గెట్‌గా దేశ వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉద్ధవ్, ఎన్సీపీ, హేమంత్ సొరేన్ ఇలా విపక్ష నేతలే టార్గెట్‌గా కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీజేపీతో దోస్తీ కట్టి బీఆర్ఎస్ నష్టపోయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌ను బెదిరించేందుకే కవిత లిక్కర్ కుంభకోణాన్ని వాడుకుంటున్నారని అన్నారు. లిక్కర్ స్కాంలో మొదట వేటు వెయ్యాల్సింది లెఫ్టినెంట్ గవర్నర్ పైనే అని చెప్పారు.
లెఫ్టినెంట్ గవర్నర్‌ను కాపాడింది ఎవరు? ఆయన ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న కారణంగానే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసే కుట్రచేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. లీడర్ లేని పార్టీగా బీఆర్ఎస్ తయారైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భయపెట్టి రాజకీయంగా ఎదగాలనే కుట్రలు బీజేపీ చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్‌కు అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.