కేసీఆర్‌ను మైమరిపించేలా కిషన్ రెడ్డి.. బిల్లా, రంగాల కొత్త డ్రామా: అద్దంకి దయాకర్

by Ramesh N |
కేసీఆర్‌ను మైమరిపించేలా కిషన్ రెడ్డి.. బిల్లా, రంగాల కొత్త డ్రామా: అద్దంకి దయాకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Telangana BJP) బీజేపీ బిల్లా, రంగాలు కొత్త పొలిటికల్ డ్రామాకు తెరలేపారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొత్త నాటకం ఆడుతున్నారని, రాహుల్‌గాంధీ కులం, మతం అంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఈ నాటకం ఆడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ నుంచి (Union Minister Kishan Reddy) కిషన్ రెడ్డి, బండి సంజయ్ (Bandi Sanjay) ఇద్దరు పనికిరాని మంత్రులు అని విమర్శించారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు.. (Rahul Gandhi) రాహుల్‌గాంధీ కులం ఏంటని అడగడం మీ రాజకీయ దివాలకోరుకు నిదర్శనమన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)ను మైమరిపించేలా కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నాడని విమర్శించారు. మీ వల్ల రాష్ట్రానికి రూపాయి ఉపయోగం లేదన్నారు. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ పునాదుల మీద దేశం ఏర్పడ్డదని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం నెహ్రూ కుటుంబమని అన్నారు. అలాంటి కుటుంబాన్ని కించపరిస్తే మిమ్మల్ని ఎవరు క్షమించరని అన్నారు.

Next Story