‘ల..కొడక ఎన్నిసార్లు ఫోన్ చేయాలి’.. అధికారిపై కాంగ్రెస్ లీడర్ బూతు పురాణం

by Prasad Jukanti |   ( Updated:2024-04-09 14:33:03.0  )
‘ల..కొడక ఎన్నిసార్లు ఫోన్ చేయాలి’.. అధికారిపై కాంగ్రెస్ లీడర్ బూతు పురాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో:ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ పై ఓ కాంగ్రెస్ లీడర్ బూతులతో రెచ్చిపోయాడు. ఫోన్ చేసి మరీ బూతు పురాణం అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు.. ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ లీడర్ రవిచందర్ ములుగు ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ జగదీశ్వర్ కు ఫోన్ చేశారు. 'ల..కొడక ఎన్నిసార్లు ఫోన్ చేయాలి. నువ్వు రేపు రా నీ సంగతి చెప్తా.. ఎన్ని సార్లు ఫోన్ చేసినా రిప్లే ఇవ్వవా అంటూ అసభ్యపదజాలంతో రెచ్చిపోయాడు. అయితే యాక్సిడెంట్ బాధితుడిని ఆసుపత్రికి తీసుకువస్తే అక్కడ వైద్యులు లేరని తాను ఫోన్ చేస్తే స్పందించవా అంటూ నోటికిపని చెప్పారు. ఇప్పుడీ ఆడియో క్లిప్ దుమారంగా మారింది.

Advertisement

Next Story