- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Addanki Dayakar : జమిలి ఎన్నికలు రాజకీయ కుట్ర.. అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: జమిలి ఎన్నికలు అనేది ఒక రాజకీయ కుట్ర అని, బీజేపీ తన రాజకీయ మనుగడ కోసమే ఈ అంశాన్ని తెర మీదికి తీసుకొని వస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. జమిలి ఎన్నికల అంశంపై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు. జమిలి ఎన్నికలు అనేది బీజేపీ తన రాజకీయ మనుగడ కోసమే చేయాలని చూస్తోందని, ఇది ప్రాంతీయ పార్టీలను, వాటి ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఈ ప్రతిపాధన తీసుకొస్తుందని మండిపడ్డారు.
రాజ్యాంగంలో ఉండే ఒక అంశాన్ని తెర మీదికి తీసుకురావడానికి వారికి ఇబ్బందులు అవుతున్నాయని, ఉదహారణకు 2026 లో డీలిమిటేషన్ చట్టం వచ్చి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉందని దాని గురించి చర్చ చేయరని, అలాగే జనగణన జరిగి బీసీ జనగణన చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, బీసీ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ దాని గురించి పట్టించుకోడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, నాలుగవ సారి ఎలా గెలవాలి.. బీజేపీ రాజకీయంగా ఎట్ల బలపడాలి.. అంతేగాక మిగతా రాజకీయ పార్టీలను ఏ విధంగా అణిచివేయాలనే దానిమీద చర్చ ఉంటుందని ఆరోపించారు. దీనిని రేపు జరగబోయే 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో కూడా చర్చకు తీసుకొస్తారని, ఇది ఒకరకంగా ప్రజలపై, దేశంపై, ప్రాంతీయ పార్టీల పై, ప్రభుత్వాలపై చేస్తున్న కుట్రగా చూడాల్సిన అవసరం ఉందని అద్దంకి దయాకర్ అన్నారు.