- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Harish Rao: కాంగ్రెస్ అంటేనే పెద్ద ధోకే బాజ్ పార్టీ.. హరీష్ రావు ఫైర్ ట్వీట్ ఇదే
దిశ, డైనమిక్ బ్యూరో: ధోకా, ధోకా, ధోకా అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అంటేనే ఓ పెద్ద ధోకే బాజ్ పార్టీ అని విమర్శించారు. ధోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ధోకా ఇచ్చిందన్నారు.
‘8 నెలల్లో ఎన్ని ధోకాలు అధ్యక్షా!?, ప్రతి మహిళలకు నెలకు 250 -ధోకా, డిసెంబర్ 9న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ - ధోకా, అన్ని పంటలకు మద్దతు ధరపై 500 బొనస్ -ధోకా, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు -ధోకా, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ -ధోకా, 25 వేల పోస్టులలో మెగా డీఎస్సీ - ధోకా, వెంటనే డిఏ, పిఆర్సి ఇస్తామని ప్రభుత్వ, ఉద్యోగులు ఉపాధ్యాయులకు -ధోకా, ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం -ధోకా, మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ -ధోకా, అవ్వా, తాతలకు 4 వేల పింఛన్ -ధోకా, దివ్యాంగులకు 6వేల పింఛన్ -ధోకా, కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం -ధోకా, ఆటో డ్రైవర్లకు 12 వేల ఆర్థిక సాయం -ధోకా, ప్రతి రోజూ సీఎం ప్రజా దర్బార్ -ధోకా, రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతుకు 15 వేలు -ధోకా, రైతు కూలీలకు 12 వేలు -ధోకా’ అని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలప్పుడు గ్యారెంటీల పార్టీ అన్ని నమ్మించి, ప్రభుత్వంలోకి రాగానే గారడి పార్టీగా మారిందని పేర్కొన్నారు.