- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్నాటకలో బీజేపీని గెలిపించేందుకు సీఎం KCR ప్లాన్: రేవంత్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరెన్ని కుట్రలు చేసినా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని, మరికొన్ని గంటల్లో ఫలితం తేలబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని చెప్పారు. జేడీఎస్‌తో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ చేసిన ప్లాన్ విఫలమైందని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై శుక్రవారం స్పందించిన ఆయన.. కుమారస్వామి సింగపూర్‌లో ఉండి ప్లాన్ వేస్తే.. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉండి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ప్రణాళికలు వేశారన్నారు.
కర్ణాటకలో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అందువల్లే కర్ణాటకలో మజ్లీస్ పోటీ చేయకుండా దూరంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి ఇన్ని పార్టీలు ఏకం అవుతున్నాయంటేనే హస్తం పార్టీ ఎంత బలమైందో అర్థం చేసుకోవాలన్నారు. కుట్రలన్నింటిని ఛేదించి రేపు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవబోతోందని.. అప్పుడు ఈ పార్టీలన్నీ తెల్లముఖం వేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. కర్నాటకలో వచ్చినట్లుగానే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.