బిగ్ న్యూస్: అభ్యర్థుల రిపోర్ట్ రెడీ చేసిన థాక్రే.. T- కాంగ్రెస్‌లో తెరపైకి కొత్త చర్చ..?!

by Satheesh |   ( Updated:2023-03-03 00:30:17.0  )
బిగ్ న్యూస్: అభ్యర్థుల రిపోర్ట్ రెడీ చేసిన థాక్రే.. T- కాంగ్రెస్‌లో తెరపైకి కొత్త చర్చ..?!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జీ మాణిక్​రావు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, ములుగు, హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే ఆయన ప్రజల నుంచి ఫీడ్​బ్యాక్ తీసుకుంటూ నివేదిక తయారు చేస్తున్నారు. ఈ రిపోర్టును ఢిల్లీకి పంపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్​నేతల్లో టెన్షన్​మొదలైంది. థాక్రే ఢిల్లీకి పంపించే రిపోర్టులో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లు ఉన్నాయంటూ గాంధీభవన్‌లో హాట్​హాట్‌గా చర్చ కొనసాగుతున్నది. దీంతో ఆ నివేదికలో ఎవరి పేర్లు ఉన్నాయోనని ఇంచార్జీలు, కీలక లీడర్లు ఉత్కంఠతో ఉండటం గమనార్హం. అయితే థాక్రే మాత్రం రహస్యంగా వివిధ నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ కావడం కాంగ్రెస్​వర్గాల్లో కలవరం కనిపిస్తోన్నది.

Advertisement

Next Story