- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కూడబెట్టుకున్న ఆస్తులెన్ని.. బీఆర్ఎస్‌కు BIG షాకిచ్చేలా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్?
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్ పదే పదే ఆరోపించింది. పొలిటికల్ లీడర్లతో పాటు బ్యూరోక్రట్స్, వారి బంధువుల పేర్ల మీద విలువైన భూములు రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఆరోపించింది. గులాబీ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. 2018 నుంచి 2023 నవంబర్ వరకు జరిగిన భూముల రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. నిజనిజాలు తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాల భూములున్నాయి? ప్రస్తుత మార్కెట్‌లో వాటి విలువ ఎంత? అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్టు తెలిసింది.
లీడర్ల ఆస్తుల గుట్టు విప్పే ప్లాన్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 10 వేల ఎకరాలు గులాబీ లీడర్ల చేతిల్లోకి వెళ్లాయని కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇప్పుడు ఆ జాబితాను బహిర్గతం చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఐదేళ్ల కాలంలో ఏ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు ఏ లీడర్, ఏ అధికారి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందనే విషయాన్ని బయటికి తీసుకొని రావాలని భావిస్తున్నట్టు సమాచారం. విలువైన అస్తులు సాధారణ వ్యక్తుల పేర్లు మీద రిజిస్ట్రేషన్ జరిగితే, ఆ వ్యక్తి నేపథ్యం ఏంటీ? అతనికి పొలిటికల్ లీడర్లతో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి? ఎవరికైనా బినామీగా ఉన్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం.
సర్కారు భూముల అన్యాక్రాంతంపై ఆరా
ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలున్నాయి. ప్రధానంగా కొందరు లీడర్లు, అధికారులు తమకున్న పవర్‌తో సర్కారు భూములు ఆక్రమించుకున్నట్టు ప్రచారం ఉన్నది. నిజంగా అలాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి ఉదాంతాలు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ఇనాం భూముల్లో జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ డాక్యుమెంట్స్ సేకరించి, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆ భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
ఫామ్‌హౌజ్‌లపైనా ఫోకస్
లీడర్లు, అధికారుల ఫామ్‌హౌజ్‌లపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. గత ప్రభుత్వంలో మెజార్టీ లీడర్లు, ఆఫీసర్లు ఫామ్‌హౌజ్‌లు ఏర్పాటు చేసుకున్నారనే ప్రచారం ఉంది. ఏ అధికారి, ఏ లీడర్‌కు ఎక్కడెక్కడ ఫామ్‌హౌజ్‌లు ఉన్నాయి? వాటి ప్రస్తుత విలువ ఎంత? అనే కోణంలోనూ డిటేయిల్స్ సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది.