Harish Rao : అశోక్ నగర్ ను శోక నగర్ గా చేసిన కాంగ్రెస్ సర్కార్ : హరీశ్ రావు

by Y. Venkata Narasimha Reddy |
Harish Rao : అశోక్ నగర్ ను శోక నగర్ గా చేసిన కాంగ్రెస్ సర్కార్ : హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నికల హమీలతో తెలంగాణ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress governmen), రాహుల్ గాంధీ(Rahul Gandhi) మోసం చేశారని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా హరీశ్ రావు ట్విటర్ వేదికగా ఆయనకు హరీశ్ రావు పలు ప్రశ్నలు సంధించారు. మీరు ఎన్నికల సమయంలో సందర్శి్ంచిన ఆశోక్ నగర్ లోనే విద్యార్థులను, నిరుద్యోగులను మీ ప్రజా ప్రభుత్వం చితకబాదించిన సంగతి మీకు తెలుసా అంటూ రాహుల్ ను ప్రశ్నించారు.

మీ ప్రభుత్వం వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాలలో 10% కంటే తక్కువ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, 'రివాంపుడ్ టీఎస్పీఎస్సీ రీబ్రాండెడ్ టీజీపీఎస్సీ అని, జాబ్ క్యాలెండర్ ఉద్యోగం లేని జాబ్ క్యాలెండర్ గా తయారైందన్నారు. యువ వికాసం 5 లక్షల హామీ గ్యారంటీ ఖాళీ గ్యారెంటీగా మారడంతో తెలంగాణ యువతకు అభద్రతాభావం ఏర్పడిందని విమర్శించారు. ఇప్పుడు మీరు అశోక్ నగర్‌ని మళ్లీ సందర్శించండని, మీ ప్రభుత్వం దానిని ‘శోక నగర్’గా ఎలా మార్చుకుందో చూడండని రాహుల్ గాంధీని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story