- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: సోషల్ మీడియాపై కాంగ్రెస్ ఫోకస్..! వెల్ఫేర్ స్కీమ్స్, అభివృద్ధిపై పబ్లిసిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: రుణమాఫీ అంశంపై కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ కార్నర్ చేస్తున్నది. సంపూర్ణంగా మాఫీ కాలేదని సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తున్నది. అయితే దీనికి కౌంటర్ అటాక్ చేయడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వెనకబడిందని మంత్రులే అంగీకరిస్తున్నారు. దీంతో గాంధీ భవన్ వేదికగా సోషల్ మీడియాను ఫుల్ యాక్టివ్ లో ఉంచాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పై వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా పబ్లిసిటీ చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ ప్రాసెస్ ను ఏఐసీసీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు మానిటరింగ్ చేయనున్నట్లు సమాచారం. కనుగోలు టీమ్ ఇప్పటికే టీపీసీసీ సోషల్ మీడియా వింగ్ తో ఓ సారి చర్చలు కూడా జరిపింది. అంతే కాకుండా కాంగ్రెస్ సోషల్ మీడియా క్రియాశీలక మెంబర్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్లు తెలిసింది. జిల్లాల వారీగా ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
రుణమాఫీపై వన్ మినిట్ వీడియో
రుణమాఫీపై కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్స్, క్రియాశీలక కార్యకర్తలు రైతులను సంప్రదించనున్నారు. ఒక నిమిషం పాటు వారి అభిప్రాయాన్ని వీడియో రూపంలో సేకరించనున్నారు. దాన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు టీపీసీసీ ఆదేశాలు ఇచ్చింది.
పవర్‌లోకి వచ్చేందుకు పవర్ ఫుల్ వర్క్
గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చేందుకు సోషల్ మీడియా విస్తృతంగా వర్క్ చేసింది. బీఆర్ఎస్ పదేళ్ల వైఫల్యాలను జనాల్లోకి సంపూర్ణంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, హామీలను ప్రచారం చేసింది. అయితే పవర్ లోకి వచ్చాక సోషల్ మీడియా వింగ్ కాస్త డల్ అయిందని పార్టీ నేతలే చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను అడ్డుకునేందుకు మళ్లీ సోషల్ మీడియా ను యాక్టివ్ చేస్తున్నామని కాంగ్రెస్ కు చెందిన ఒక నేత తెలిపారు. సోషల్ మీడియాను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా గాంధీభవన్ వార్ రూమ్ కు ఆదేశాలిచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.