- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏడాది సంబరాలకి కాంగ్రెస్ రెడీ.. వారం పాటు ఫుల్ సెలబ్రేషన్స్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ ఏదో తేదీతో ఏడాది పూర్తికానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. కనీసం వారం రోజుల పాటు హైదరాబాద్ నుంచి మొదలుకుని గ్రామ స్థాయి వరకు ఉత్సవాలు జరిగే విధంగా షెడ్యూలు తయారు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా పొగ్రామ్స్ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఏ రోజు ఏ పొగ్రాం ఉండాలి? ఏ విధంగా ఆ పొగ్రాం డిజైన్ చేయాలి? అని ఇరువురు ఇప్పటికే తొలి దఫా చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే డిసెంబరు 9న ముగింపు వేడుకల సందర్భంగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మీటింగ్ కు సోనియా, రాహుల్ ను ప్రత్యేక అతిథిలుగా ఆహ్వానిస్తున్నారు.
క్షేత్ర స్థాయి నుంచి హైదాబాద్ వరకు వరస మీటింగ్స్
వన్ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రతి గ్రామంలో జరిగేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు పలు స్కీమ్స్ లో ప్రయోజనం పొందిన లబ్దిదారులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. అందుకు ప్రతి గ్రామ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించనున్నారు. అలాగే మండలం, జిల్లా స్థాయిలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించడం, ఆ మీటింగ్స్ కు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రతిప్రతినిధులు హాజరయ్యేవిధంగా కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు.
కల్చరల్ పోగ్రామ్స్
సెలబ్రేషన్ లో భాగంగా ఏ పొగ్రామ్స్ ఉండాలి? ఎలాంటి కల్చరల్ పోగ్రామ్స్ నిర్వహించాలి? అనే అంశంపై కల్చరల్ డిపార్ట్ మెంట్ ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఉత్సవాలు ఎక్కువ రోజులు కాకుండా, వారం లేదా పది రోజుల పాటు నిర్వహించే విధంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా కల్చరల్ పొగ్రామ్స్ డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు, సైన్ బోర్డులు, కటౌట్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఆలాగే మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు, విజయగాథలను టెలికాస్ట్ చేయాలని భావిస్తున్నారు.
డిసెంబర్ 9న పబ్లిక్ మీటింగ్
డిసెంబర్ 9న భారీ పబ్లిక్ మీటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణం చేశారు. కానీ 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుపై నాటి హోం మంత్రి చిదంబరం పార్లమెంట్ లో ప్రకటన చేశారు. దీంతో ప్రతి ఏటా డిసెంబర్ 9ను తెలంగాణ ప్రకటన దినోత్సవంగా జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఈ ఏడాది డిసెంబర్ 9న భారీ పబ్లిక్ మీటింగ్ నిర్వహించి, ఆ మీటింగ్ కు సోనియా, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు. అయితే మీటింగ్ హైదరాబాద్ లో నిర్వహించాలా? లేదా వరంగల్ లో నిర్వహించాలా? అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ సీనియర్ మంత్రి తెలిపారు.
సోనియా చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
డిసెంబరు 9 సోనియా గాంధీ పుట్టిన రోజు. అదేరోజు ఆమెను రాష్ట్రానికి ఆహ్వానించి పబ్లిక్ మీటింగ్ తో పాటు సెక్రెటేరియట్ ఎదురుగా నిర్మిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం నమూనా పైనల్ అయినట్టు తెలుస్తున్నది. మరో నెల రోజుల సమయం ఉండటంతో, సెక్రెటేరియట్ రాత్రింబవళ్లు పనులు కొనసాగుతున్నాయి.
సాధించిన ప్రగతిపై రిపోర్టులు
ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే ప్రగతిరిపోర్టులు ఇవ్వాలని ఆదేశించడంతో దాదాపు అన్ని శాఖలు నివేదికలు సమర్పించినట్టు తెలిసింది. ఈ ఏడాది కాలంలో తమ శాఖలో జరిగిన అభివృద్ధి, సంక్షమే పథకాల వివరాలు, లబ్ధిదారులకు చెందిన గణంకాలను సైతం అందులో పేర్కొనట్టు తెలిసింది. ఒక్కొక్క రోజు ఒక్కో పొగ్రెస్ రిపోర్టులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. అలాగే ప్రతి మంత్రి తన శాఖ పరిధిలో జరిగిన ప్రగతిపై ప్రత్యేకంగా బుక్ లెట్స్ రిలీజ్ చేయనున్నారు.