రెండు పార్టీలకు ఆ పేరే ‘‘అస్త్రం’’.. తమదైన శైలీలో పబ్లిసిటీ చేస్తోన్న కాంగ్రెస్, YSRTP!

by Satheesh |   ( Updated:2023-05-17 07:27:13.0  )
రెండు పార్టీలకు ఆ పేరే ‘‘అస్త్రం’’.. తమదైన శైలీలో పబ్లిసిటీ చేస్తోన్న కాంగ్రెస్, YSRTP!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైస్సార్​ పేరును రాజకీయ పార్టీలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ లబ్ధి కొరకు ప్రచారం చేసుకుంటున్నాయి. సొంత పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల, కాంగ్రెస్ పార్టీలకు వైఎస్సార్​పేరు అస్త్రంగా మారింది. వైఎస్​స్పూర్తితో ముందుకు సాగుతున్నామంటూ రాజకీయ పార్టీలు తమ దైన శైలీలో పబ్లిసిటీ చేస్తున్నాయి. వైఎస్సార్ కూతురు షర్మిల రాజశేఖర్ రెడ్డి పేరును వాడకుండా రెండు నిమిషాలు కూడా మాట్లాడలేని పరిస్థితి.

అందుకే ఆయన పేరుతోనే పార్టీని పెట్టడం గమనార్హం. ప్రతి మాటలో వైఎస్ పదాన్ని ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నది. ఆ పదం లేకుంటే షర్మిలకు కూడా ఆ స్థాయిలో ప్రచారం జరగదనేది పొలిటికల్​విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆమె పెట్టిన సభలు, సమావేశాల్లో రాజన్న రాజ్యం అంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోన్నది. కానీ అది ఏ మేరకు జనాల్లోకి వెళ్తుందనేది రాబోయే ఎన్నికల్లో నిర్ధారణ అవుతుంది.

ఇక కాంగ్రెస్​పార్టీలో రాజకీయ ఉద్దండులున్నప్పటికీ వైఎస్సాఆర్​పేరుతో ఆ పార్టీ వాడుతూనే ఉంటుంది. గతంలో వైఎస్​ఆ స్థాయిలో మేలు చేశాడని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటున్నది. వైఎస్ఆర్​ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఎంతో మందికి పేదలకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లోనూ​ప్రచారం చేయనున్నది.

ప్రధానంగా ఆసరా ఫించన్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్​మెంట్, సబ్సిడీ లోన్లు, ఇందిరమ్మ ఇళ్లు వంటివన్నీ వైఎస్సార్​హాయంలోనే ప్రారంభమైనట్లు కాంగ్రెస్​పార్టీ చెబుతున్నది. ఈ సారి అధికారంలోకి వస్తే అలాంటి స్కీమ్‌లు మరిన్ని అందుబాటులోకి వస్తాయని ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ రెండు పార్టీలు ఒకటైతయా..?

వైఎస్​బొమ్మతో ప్రచారం చేయబోతున్న ఈ రెండు పార్టీలు ఒకటవుతాయనే చర్చ సోషల్ మీడియాల్లో, పొలిటికల్​వర్గాల్లో మొదలైనది. వైఎస్సార్​అభిమానులంతా ఏకతాటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు షర్మిల పార్టీ చెబుతున్నప్పటికీ, కాంగ్రెస్​నుంచి ఇప్పటికీ పొత్తుపై ఎలాంటి సంకేతాలు లేవు. వైఎస్సార్​టీపీ.. కాంగ్రెస్‌తో కలవాలనుకునేది నిజమే అయినప్పటికీ, కాంగ్రెస్​పార్టీ హై కమాండ్​ ఏ నిర్ణయం? తీసుకుంటుందనేది తెలియాల్సి ఉన్నది. కానీ రేవంత్‌తో పాటు ఇతర రాష్ట్ర టీపీసీసీ పెద్దలు తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని పలుమార్లు నొక్కి చెప్పారు. కేసీఆర్‌ను సింగల్‌గానే డీ కొంటామని రేవంత్ ఇటీవల మీడియా చిట్​చాట్‌లోనూ క్లారిటీ ఇచ్చారు.

Read more: కాంగ్రెస్ ఇంచార్జ్ ఇంటి ముందు ఆందోళన

బిగ్ న్యూస్: BRS ఎమ్మెల్యేలకు ఎలక్షన్ కౌంట్ డౌన్ స్టార్ట్!...రంగంలోకి KCR.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బిగ్ ప్లాన్....అత్యవసరంగా ఎల్పీ, కేబినెట్ భేటీ వెనుక కారణం అదే..?

Advertisement

Next Story