DK Aruna: మా భూములు కాజేశారు.. వక్ఫ్ ల్యాండ్స్‌పై డీకే అరుణకు ఫిర్యాదులు

by Prasad Jukanti |
DK Aruna:  మా భూములు కాజేశారు..  వక్ఫ్ ల్యాండ్స్‌పై డీకే అరుణకు ఫిర్యాదులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వక్ఫ్ భూముల సమస్యలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) మెంబర్, ఎంపీ డీకే అరుణకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వందల ఏళ్లుగా తమ భూములు కాజేశారని బాధితులు ఆమెకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్, నర్సాపూర్, తుప్రాన్ నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన బాధితులు ఇవాళ హైదరాబాద్‌లో డీకే అరుణను కలిసి తమ గోడును చెప్పుకున్నారు. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన డీకే అరుణ.. ఆయా ప్రాంతాల్లో ఉన్న వక్ఫ్ భూముల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యను జేపీసీ సమావేశంలో ప్రస్తావిస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story