- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపల్ సీఎస్ అరవింద్ కుమార్‌పై చర్యలు తీసుకోండి!
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో తరచూ ప్రజలపై వీధి కుక్కలు దాడులు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. ఇటీవల కాజీపేట రైల్వే కాలనీలో యూపీ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వలస కుటుంబానికి చెందిన 7 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ కుక్కల దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విఫలమైందని అందువల్ల ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆదివారం జాతీయ మానవ హక్కులకు కమిషన్ కు బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు.
గతంలో అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలోనూ ఓ పసి బాలుడు చనిపోయాడని ఈ ఘటన తర్వాత కూడా అనేక చోట్ల కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని ఆరోపించారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంబర్ పేట ఘటన సయమంలో హైదరాబాద్ మేయర్, ఇప్పుడు కాజీపేట ఘటన సమయంలో అక్కడి మేయర్ ఒకే తరహా సమాధానాలు ఇస్తున్నారని మండిపడ్డారు. కాజీపేట ఘటన తర్వాత బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ స్థానిక నేతలు లక్ష రూపాయలు ఇచ్చి వారిని యూపీకి తరిమేశారని ఆరోపించారు. బాలుడి ప్రాణం విలువ లక్ష రూపాయలేనా అని ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన రోజే మున్సిపల్ సీఎస్ అరవింద్ కుమార్ పర్యటించారని అయినా ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వీధి కుక్కలను నివారించడంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా విఫలం అయిందని అందువల్ల అరవింద్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read...