- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS MLC : సీఎం రేవంత్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై కాంగ్రెస్ ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: మహబూబాబాద్ టౌన్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టౌన్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు పై పోలీసులకు ఫిర్యాదు మహబూబాబాద్ టౌన్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంలో రవీందర్ రావు సీఎం రేవంత్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడారని బేషరతుగా రవీందర్ రావు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేక అధికారం కోల్పోయామనే అక్కసు కుల అహంకారం తో నోటికి వచ్చినట్లు సీఎంని ‘రండ’ అని, చెప్పుతో కొడతామని పనికిరాని వాడని, ఇలా అనరాని మాటలు మీడియా వేదికగా మాట్లాడారని ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరిపి రవీందర్ రావు పై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అంజయ్య పోలీసులకు విజ్ఞప్తి చేశారు.