RS Praveen Kumar : బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఫిర్యాదు

by M.Rajitha |
RS Praveen Kumar : బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పై ఇబ్రహీంపట్నం(IbrahimPatnam) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయింది. శేరిగూడ గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ ఈ ఫిర్యాదు చేశారు. నేడు బీఆర్ఎస్ 'గురుకులబాట'(Gurukulabata) కార్యక్రమంలో భాగంగా.. ఫైవ్ మెన్ కమిటీ(Five Men Committee) అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో శేరిగూడ గురుకుల పాఠశాలకు వెళ్ళి విద్యార్థుల సమస్యలపై మాట్లాడారు. ముందస్తు అనుమతి లేకుండా హాస్టళ్లలోకి ప్రవేశించారని ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా గత కొంతకాలంగా రాష్ట్రంలోని గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండగా.. ఆయా ఘటనలపై బీఆర్ఎస్ పార్టీ 'గురుకుల బాట' కార్యక్రమాన్ని చేపట్టి, ఫైవ్ మెన్ కమిటీని వేసింది. ఈ కమిటీ గురుకులాలను, హాస్టళ్లను తనిఖీ చేసి.. ఆ రిపోర్ట్ సహాయంతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం అవుతోంది. అందులో భాగంగా నేడు ఇబ్రహీంపట్నంలోని శేరిగూడ గురుకుల పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.

Next Story