- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Brinda Karat: దేశంలో ఆ పనిచేస్తోంది కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే

దిశ, వెబ్‌డెస్క్: భారత కమ్యూనిస్టు పార్టీ మర్క్సిస్టు(CPIM) తెలంగాణ నాలుగో మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రం వేదికగా జరుగుతున్నాయి. ఈ మహాసభలకు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకారత్(Brinda Karat), బీవీ రాఘవులు(BV Raghavulu), రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) హాజరయ్యారు. ఈ సందర్భంగా బృందాకారత్ మీడియాతో మాట్లాడారు.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) అంబేద్కర్(Ambedkar)ను అవమానించిన సందర్భాన్ని గుర్తుచేశారు. తక్షణమే హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బుల్డోజర్ వ్యవస్థపై పోరాటం చేస్తున్నది ఒక్క కమ్యూనిస్టు పార్టీ(Communist Party) మాత్రమే అని అన్నారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం(Modi Govt) పెట్టుబడిదారుల కోసం కార్మిక చట్టాలను కాలరాసిందని మండిపడ్డారు. సామాన్య జనాల్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతా కలిసి పోరాటం చేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుందని తెలిపారు. అనంతరం బీవీ రాఘవులు మాట్లాడారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే జమిలి ఎన్నికలు(Jamili Election) తీసుకొస్తోందని ఆరోపించారు. జమిలి వస్తే బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ పని అయిపోయినట్లే అని అన్నారు. చివరకు కాంగ్రెస్ పని కూడా ఖతం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, నేటి నుంచి ఈనెల 28వ తేదీ వరకు సంగారెడ్డి(Sangareddy) వేదికగా సీపీఐఎం సభలు(CPIM Sabha) జరగనున్నాయి. శనివారం పట్టణంలో ప్రజాప్రదర్శన నిర్వహించారు. 26 నుంచి మూడు రోజుల పాటు పట్టణంలోని మల్కాపురం చౌరస్తా సమీపంలోని గోకుల్ గార్డెన్స్‌లో మహాసభలు జరగనున్నాయి. తొలిరోజు సభలకు పార్టీ అఖిల భారత నాయకులు ప్రకాశ్ కారాట్, ఎ.విజయరాఘవన్ హాజరుకానున్నారు. మరోవైపు.. బహిరంగ సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు, బృందా కారత్, బీవీరాఘవులు, తమ్మినేని వీరభద్రం, జి.నాగయ్య, చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య హాజరుకానున్నారు.