సచివాలయం నిర్మాణంలోనూ కమీషన్లు: బండి సంజయ్

by Mahesh |   ( Updated:2023-04-30 07:57:20.0  )
సచివాలయం నిర్మాణంలోనూ కమీషన్లు: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సచివాలయం నిర్మాణాన్ని రూ.600 కోట్లతో ప్రారంభించి రూ.1600 కోట్లకు పెంచి కమీషన్లు దోచుకున్నారని, దళితబంధులోనూ 30 శాతం కమిషన్లు తీసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్ లో నిర్వహించిన ప్రధాని మోడీ “మన్ కీ బాత్” వందో ఎపిసోడ్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సంజయ్ మాట్లాడారు.

తెలంగాణ మొత్తం లంచాల మయంగా మారిందని ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ పట్టుమని రోజుకు నాలుగు గంటలు కూడా పనిచేయడం లేదని ఆయన మండిపడ్డారు. ఆయనకు ప్రగతి భవన్ గడీల నుంచి పేదల కష్టాలు కనిపించవని ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయం గతంలో బాగుండేదని, నల్ల పోచమ్మ గుడి కూడా కూల్చారని మండిపడ్డారు.

కేసీఆర్ తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డ్రైనేజీలో పాప పడి చనిపోయిందని, కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రాణాలకు వెల కడుతోందని ఫైరయ్యారు. కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్.. సచివాలయంలా కనిపించడం లేదని, ఇప్పటికే ఒవైసీ కూడా తాజ్ మహల్ లాగా ఉందని చెప్పారన్నారు. ఓవైసీ కళ్ళలో ఆనందం కోసమే ముఖ్యమంత్రి కట్టారని సంజయ్ చెప్పారు. తాను సచివాలయాన్ని కూలుస్తా అని అనలేదని, పునర్నిర్మిస్తానని చెప్పానని క్లారిటీ ఇచ్చారు.c

సెక్రటేరియట్ ప్రాంగణంలో నల్ల పోచమ్మ దేవాలయాన్ని ఎందుకు కట్టలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని, ఇది తాము చెప్పడం లేదని, ఆ పార్టీల నేతలే చెబుతున్నారని సంజర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీయేనని బండి సంజయ్ నొక్కి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed