- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పదేళ్లు అధికారంలో ఉండి రేషన్ కార్డులేందుకివ్వలేదు’.. హరీష్ రావును ప్రశ్నించిన ఆది శ్రీనివాస్
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు సంతోషంగా ఉన్నారని హరీష్ రావు బాధపడుతున్నారన్నారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. హరీష్ రావు ఓర్వలేకనే అలా మాట్లాడుతున్నారని అన్నారు. రుణమాఫీపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే మా ప్రభుత్వం అనుసరిస్తోందని.. కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదని వెల్లడించారు. పదేళ్లు అధికారంలో ఉండి రేషన్ కార్డులు ఎందుకివ్వలేదని హరీష్ రావును ప్రశ్నించారు. మొత్తం రూ. 31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామని, రైతులను రెచ్చగొట్టే హరీష్ రావు ప్రయత్నాలు ఫలించవని ఆది శ్రీనివాస్.. మాజీ మంత్రి హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నేడు హైదరాబాదులోని గాంధీభవన్‌లో హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే.