రాజాసింగ్ వార్నింగ్.. డేనియల్ ఫెర్నాండెజ్‌ కామెడీ షో క్యాన్సిల్

by Prasad Jukanti |
రాజాసింగ్ వార్నింగ్.. డేనియల్ ఫెర్నాండెజ్‌ కామెడీ షో క్యాన్సిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో ప్రముఖ స్టాండింగ్ కమెడియన్ డేనియల్ ఫెర్నాండెజ్ కామెడీ షో క్యాన్సిల్ అయింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ షో రద్దుచేసుకున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లో డేనియల్ ఫెర్నాండెజ్ షో నిర్వహించాలని భావించారు. ఈ మేరకు టికెట్లు సైతం విక్రయించారు. అయితే ఇటీవల జైనులను ఉద్దేశించి డేనియల్ ఫెర్నాండెజ్ చేసిన కామెడీ వీడియో వివాదాస్పదంగా మారింది. బక్రీద్ నాడు జైనులు మేకలను కొనుగోలు చేశారని తన షోలో చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి షో కోసం డేనియల్ హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజాసింగ్ హెచ్చరించారు. గతంలో మునావర్ ఫరూఖీ విషయంలో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని హిందువులు, జైనుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణకు రావాలంటే 50 సార్లు ఆలోచించాలంటూ ఓ వీడియోను రాజాసింగ్ రిలీజ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో డేనియల్ ఫెర్నాండెజ్‌ తన షో క్యాన్సిల్ చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed