Sama Rammohan Reddy : అసెంబ్లీకి రా..మాట్లాడుకుందాం : కేసీఆర్ కు సామా పిలుపు

by Y. Venkata Narasimha Reddy |
Sama Rammohan Reddy : అసెంబ్లీకి రా..మాట్లాడుకుందాం : కేసీఆర్ కు సామా పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏడాది పాలనపై చేసిన విమర్శలు పట్ల తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో బహిరంగ సభలు పెడుతానంటున్న కేసీఆర్ వ్యాఖ్యలను సామా రామ్మోహన్ రెడ్డి స్వాగతించారు. రోజుకో బహిరంగ సభలు పెట్టుకోవచ్చని..అయితే మా ఏడాది పాలనపైన..మీ పదేళ్ల పాలనపై బహిరంగంగా చర్చిద్ధామని అసెంబ్లీ(Come to the Assembly)కి రావాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.

మీ పదేళ్ల ఆరాచక పాలనపైన..ప్రజా ఉద్యమాలపైన, ప్రతిపక్షాలపై చేసిన అణిచివేతపైన, అవినీతిపైన, రాష్ట్రం నెత్తిన వేసిపోయిన అప్పులపైన.. కూలిన ప్రాజెక్టులపైన బహిరంగంగా చర్చిద్ధామని..అసెంబ్లీకి రావాలని అనేక సార్లు మేం ఓపెన్ ఛాలెంజ్ చేశామని..అయినా అసెంబ్లీకి రాకుండా తోకముడిచి ఫామ్ హౌస్ లో పడుకున్నాడని సామా ఎద్దేవా చేశారు. నిజంగా కూడా పదేళ్లలో వారి పాలనా వైఫల్యాలు..అవినీతిపైన..కాంగ్రెస్ ఏడాది పాలనపైన చర్చ జరుగాలనే మేం కోరుతున్నామన్నారు. కేసీఆర్ ను బయటకు రమ్మని మేం కూడా డిమాండ్ చేస్తున్నామని..బహిరంగ సభలు మీరు పెట్టుకోవడం కంటే...అసెంబ్లీకి వస్తే బహిరంగంగానే మాట్లాడుకుందామని నీ పరిపాలన, మా పరిపాలన బేరీజు వేసుకుందామని సామా పిలుపునిచ్చారు.

అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించకుండా..ప్రతిపక్ష నేతగా వ్యవహరించకుండా ఇంతకాలం ఎందుకు కనుమరుగయ్యారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ పాలనలోనే కూలిపోయిందని..మీ అవినీతి కారణంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పనికి రాకుండా పోయాయన్న సంగతి కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి సన్న బియ్యం ఇవ్వని కేసీఆర్ ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని..ఇవ్వాళ మా ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందన్నారు. 2018నుంచి కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని..మేం ఏడాదిలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చామని వీటన్నింటిపై కేసీఆర్ చర్చకు రావాలని సామా సవాల్ చేశారు.

Next Story

Most Viewed