- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రి వరకు సెక్రటేరియట్‌లోనే సీఎం తమ్ముడు..: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
దిశ, వెబ్‌డెస్క్: రాత్రి వరకు సెక్రటేరియట్‌లోనే సీఎం రేవంత్ తమ్ముడు ఉంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే అవినీతి పెద్దఎత్తున జరిగిందని బిజెపి ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ఆరోపించారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి కోసం రూ.7,500 ఇచ్చినా చెక్కు రాలేదని కాంగ్రెస్ నాయకుడిని నిలదీసిన ఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి తమ్ముడు కూడా సచివాలయంలో రాత్రయ్యే వరకు మకాం వేస్తున్నారని ఆరోపించారు. పైసల వసూళ్ల కార్యక్రమంలో సీఎం తమ్ముడు బిజీగా ఉన్నారన్నారు. మంత్రులందరూ కూడా ప్రతి పనికి పైసా వసూలు కార్యక్రమంలో ఉంటున్నారు. కాంగ్రెస్ నాయకులు గల్లీ నుండి పై స్థాయివరకు అవినీతిలో మునిగిపోయారు. తెలంగాణలో పాలన స్తంభించిందని.. ఎవరికి వారే యమునా తీరన్నట్లు పరిస్థితి ఉందన్నారు. గ్రామీణ, పంచాయతీ రాజ్, రోడ్లు, భవనాల శాఖలో ఉన్న రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక పనులు చేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని..ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, నాయకుల అవినీతి, ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని ఆయన అన్నారు.