సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-17 11:12:46.0  )
సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలన్నది కేసీఆర్ ఆలోచనే అన్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్ చేవెళ్లకు మారడానికి కారణం చెల్లెమ్మ సబితా కాదా అని ప్రశ్నించారు. తమ్ముడు హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతుంటే చేవెళ్ల చెల్లెమ్మ సరిదిద్దొద్దా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావును నిలదీస్తున్నా మీరు కాదా కాళేశ్వరం దుర్గార్గాలకు బాధ్యులు అని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ పాపాలకు హరీష్ రావు, కేసీఆరే కారణమన్నారు. ఇరిగేషన్ మినిస్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పుల తడక అంటున్నారని.. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారన్నారు. కేసీఆర్ పేరు చెడగొట్టాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమని హరీష్ రావు అన్నారు.

Advertisement

Next Story