జర్నలిస్ట్ శంకర్‌పై దాడి వెనక CM రేవంత్ హస్తం: కేటీఆర్

by Satheesh |   ( Updated:2024-02-25 16:15:34.0  )
జర్నలిస్ట్ శంకర్‌పై దాడి వెనక CM రేవంత్ హస్తం: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్ట్ శంకర్‌పై జరిగిన హత్యాయత్నం వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం తుర్కయంజల్‌లోని శంకర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్‌లో జరుగుతున్న రైతుల భూకబ్జాల పైన నిజాలు వెల్లడించినందుకే శంకర్ పైన దాడి జరిగిందన్నారు. భవిష్యత్తులో శంకర్‌కు హాని జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాల్సి వస్తుందని తెలిపారు. గత కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహించిన కాంగ్రెస్ గుండాలు శంకర్‌ను అంతమొందించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. స్థానిక పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా అలసత్వం, పక్షపాతం చూపించారన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీని కేటీఆర్ కోరారు.

Also Read..

జర్నలిస్ట్ శంకర్‌ను పరామర్శించిన మంత్రి కేటీఆర్

Advertisement

Next Story