- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Ponnam : వేములవాడలో ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన : మంత్రి పొన్నం
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈనెల 20వ తేదీన సిరిసిన్న రాజన్న జిల్లా వేములవాడలో పర్యటించనున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhaker) వెల్లడించారు. కార్తీక మాసం సందర్భంగా రేవంత్ రెడ్డి రాజన్నను దర్శించుకోవడంతో పాటు దేవాలయ అభివృద్ధి, టెక్స్ టైల్ ఇండస్ట్రీ, ఇరిగేషన్ సహా ఈ ప్రాంతానికి సంబంధించిన పనులు ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవాల సందర్భంగా 19న వరంగల్ మహిళా సదస్సు, 20న కరీంనగర్ లో యువజన సదస్సు, తదుపరి మహబూబ్ నగర్ లో రైతు సదస్సు, డిసెంబర్ 7,8 తేదీల్లో హైదరాబాద్ కార్నివాల్, బహిరంగ సభలు నిర్వహిస్తమన్నారు. తమది ప్రజా పాలన ప్రభుత్వమని, అందరికి స్వేచ్చయుతంగా నిరసనలకు అవకాశమిచ్చామన్నారు.
ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి 7.50లక్షల కోట్ల అప్పుతో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ఏడాది పాలనలో ఎలాంటి భూములు అమ్మకుండా రైతులకు2లక్షల రుణ మాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత విద్యుత్తు, 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కు సిలిండర్ వంటి పథకాలు అమలు చేశామని తెలిపారు. గురుకులాలకు మెస్ చార్జీలు పెంచామన్నారు. ధాన్యం కొనుగోలు జరిపిస్తుందని, సన్న ధాన్యానికి 500బోనస్ ఇస్తుందన్నారు. డిఫాల్టర్ రైస్ మిల్లర్లు 20వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, బకాయిలు చెల్లిస్తే వారికి అవసరమైన చేయూత ప్రభుత్వం అందిస్తుందన్నారు.