- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానంగా సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) నేతృత్వంలో.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆ సమావేశ అనంతరం.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ప్రత్యేక సమావేశం అయ్యారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద నష్టంపై కేంద్రం కేటాయించిన వరద సహాయాన్ని మరింత పెంచాలని అమిత్ షాను కోరారు. అలాగే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, మరింత మంది ఐఏఎస్ లను రాష్ట్రానికి కేటాయించాలని కూడ సీఎం అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఇక ఖట్టర్ తో జరిగిన సమావేశంలో.. హైదరాబాద్ నగరంలో మురుగు నీటి శుద్ధీకరణకు నిధులు విడుదల చేయాలని, మెట్రో రెండో దశ పనులకు అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. కాగా రెండు రోజుల హస్తిన పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే తిరగి హైదరాబాద్ కు బయల్దేరారు.