సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది

by Mahesh |
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల రెండు వారాల పాటు విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కు చేరుకుని రెండు రోజుల పాటు పలు కీలక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మ పర్యటన తర్వాత హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కాగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను ముగించుకుని తెలంగాణకు చేరుకోనున్నారు. వచ్చి రాగానే తన నివాసంలో పలువురు ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీతో పాటు వివిధ కార్పొరేషన్‌లపై సీఎం సమిక్ష చేయనున్నారు. ఇందుకోసం ఆదివారం.. కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష రేవంత్‌ అధ్యక్షతన రేపు ఐటీసీ కోహినూర్‌లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రభుత్వ పాలనపై ఈనెల 19 నుంచి వరుస సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి వచ్చి రాగానే ఢిల్లీ పర్యటన చేయడం.. టీపీసీసీ చీఫ్, మంత్రి వర్గ విస్తరణ అంశాలు చర్చించడానికి అని జోరుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

Next Story