- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడిగడ్డను పరిశీలించిన సీఎం రేవంత్ బృందం.. మంత్రుల రియాక్షన్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. డ్యామేజ్ అయిన 21వ నెంబర్ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు అక్కడ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని మండపడ్డారు. తప్పు జరిగింది కాబట్టే బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించినా మొహం చాటేశారని ఎద్దేవా చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే రాలేదని సెటైర్ వేశారు.
అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైల్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయని అన్నారు. డిజైల్ లోపాల గురించి ఆనాడే తాను కేసీఆర్‌కు చెప్పానని గుర్తుచేశారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ప్రధానమైనదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిలుస్తేనే.. ఎక్కడికైనా ఎత్తిపోసేది అని అన్నారు. కానీ, ప్రస్తుతం ఇక్కడ నీరు నిలిచే పరిస్థితి లేదని తెలిపారు. మిగతా జలాశయాలకు నీటిని ఎలా ఎత్తిపోస్తారు? అని ప్రశ్నించారు. కాగా, మేడిగడ్డ సందర్శనకు రావాలని పార్టీలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించారు. కానీ, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.