- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేసీఆర్, హరీష్ రావులకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్!

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి హరీష్ రావు చేసిన సవాల్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, హరీష్ రావులకు సంచలన సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జనజాతర సభలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయ్యకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ రావు అంటున్నాడని, తాను కూడా కేసీఆర్, హరీష్ రావులకు సవాల్ విసురుతున్నానని, తాను చెప్పినట్టు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే మీరు మీ పార్టీని రద్దు చేసుకుంటారా అని ఛాలెంజ్ చేశారు. అలాగే అక్కడ సూర్యడు ఇక్కడ మొలిచిన, భూమి ఆకాశం తలక్రిందులైనా, కేసీఆర్ ఫాంహౌజ్ లో ఉరి వేసుకొని సచ్చిన రైతులకు పంద్రాగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూసిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read More...
CM రేవంత్ రెడ్డి మీటింగ్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. ఒక్కసారిగా కూలిన టెంట్ (వీడియో)