- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth: హైదరాబాద్ వేదికగా ఒలంపిక్స్ గేమ్స్.. అదే మన లక్ష్యం
దిశ, వెబ్‌డెస్క్: క్రీడా విశ్వవిద్యాలయంపై సంబంధిత అధికారులతో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా శిక్షణ సంస్థలన్నీ ఒకే గొడుకు కిందకు వచ్చేలా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో ఒలంపిక్ గేమ్స్‌కు వేదికగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ వర్సిటీ ఉండాలని ఆదేశించారు. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఇటీవల ఒలంపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలు తీసుకుంటున్న శిక్షణపైన కూడా అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేయనుందని.. ఈ స్కూళ్లకు ‘యంగ్ ఇండియా’ అనే పేరు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. యూనివర్సిటీలో ఆయా క్రీడల్లో శిక్షణకు అవసరమైన వసతులు కల్పించి వారికి అవసరమైన ఆహారాన్ని, శారీరక వ్యాయామ సౌకర్యాలను కల్పించాలన్నారు. స్పోర్ట్స్ వర్శిటీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను, ఏ క్రీడలపై ఆసక్తి ఉన్నదో పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు.
Read More..
Bahubali kaja : సీఎం రేవంత్‌కి బాహుబలి కాజా గిఫ్ట్.. హీరో ప్రభాస్ పెద్దమ్మ ఇచ్చిన ఫేమస్ స్వీట్