- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. తెలంగాణలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అండగా నిలవాలని కోరారు. కాగా, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి వరద పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను.. తీసుకున్న జాగ్రత్తలను వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానికి తెలిపారు.
Advertisement
Next Story