- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: ప్రభుత్వంపై విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించండి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మత వివక్షకు తావులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మతకల్లోలాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, భారత దేశం మత సమ్మరస్యానికి ప్రతీక అని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతీ పేద వాడికి చేర్చే బాధ్యత తమది అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించాలని రేవంత్ రెడ్డి కోరారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడో యాత్ర చేశారని, దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని, ఆయనకు అందరి మద్దతు ఉండాలని కోరుతున్నానని అన్నారు.
డా.పి.సతీష్ కుమార్ వాక్యపరిచర్యకు 35 వసంతాలు పూర్తయిన సందర్భంగా సోమవారం ఎల్బీ స్టేడియంలో కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లతాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్ 7న ఇదే ఎల్బీ స్టేడియంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ తాము బాధ్యత తీసుకున్నామన్నారు. చెడును తొలగించి మంచిని పెంచేందుకు కృషి చేస్తున్నానని, అందరినీ అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. భారతీయ సంస్కృతి ఎంతో బలమైందని, కుల, మతాలకు అతీతంగా ఇక్కడ అందరికీ గౌరవం ఉంటుందన్నారు. విద్య, వైద్య సేవల్లో క్రిస్టియన్ మిషనరీల కృషి అభినందనీయమన్నారు. విద్య, వ్యాపారంగా మారిన రోజుల్లో తక్కువ ఖర్చుతో క్రిస్టియన్ మిషనరీలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయన్నారు. క్రిస్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్న ఆసుపత్రులు ఆదర్శనీయమని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రతీ పేదవాడికి సరైన వైద్యం అందించాలని ఆనాడు వైఎస్ రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారన్నారు. కల్వరీ టెంపుల్ ను అంత గొప్పగా నిర్వహించడం సతీష్ కే సాధ్యమైందని అభినందించారు. యువత వ్యసనాలకు బానిస కావడం సమాజానికి తీరని నష్టమన్నారు. గంజాయి, డ్రగ్స్ పీడ విరగడ చేసేలా సామాజిక బాధ్యతగా భక్తులకు సందేశం ఇవ్వాలని సతీష్ ని కోరుతున్నానని అన్నారు. గంజాయి, డ్రగ్స్ రూపుమాపేందుకు ప్రభుత్వం వైపు నుంచి తమ వంతు కృషి చేస్తున్నానని, దైవ దూతగా మీ వైపు నుంచి తమ వంతు బాధ్యత తీసుకోవాలని అన్నారు.డా.సతీష్ సమాజ సేవకు అంకితమై 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.