- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో 10 లక్షల మంది ఆడబిడ్డలతో మీటింగ్: సీఎం రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తిర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేవలం ఐదేళ్లలోనే పేద మహిళలను సంపన్నులుగా మార్చుతానన్నారు. ఆడబిడ్డ చేతిలో ఆర్థిక వ్యవస్థ ఉంటే కుటుంబాలు హ్యాపీగా ఉంటాయన్నారు. పిల్లలు మంచి విద్యను అందుకొని దేశ భవిష్యత్‌కు ఉపయోగపడతారన్నారు. అప్పుడే బంగారు తెలంగాణ అవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే పది లక్షల మంది ఆడబిడ్డలతో మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌లో జరిగిన మహిళా శక్తి సదస్సులో ఆయన పాల్గొని ప్రసగించారు. ప్రస్తుతం మహిళా సంఘాల్లోని 63 లక్షలమందికి వడ్డీ లేని రుణాలు అందజేస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తామన్నారు.
కాంగ్రెస్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు హైదరాబాద్ శిల్పారామం పక్కన 100 స్టాళ్లు ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. నెల రోజుల్లో ప్రభుత్వమే అన్ని జాగ్రత్తలు, చట్ట బద్ధత కల్పిస్తూ ఈ స్టాళ్లను ఏర్పాటు చేసి ఇస్తుందన్నారు. టాటా, బిర్లా, అంబానీలతో తెలంగాణ మహిళా సంఘాలు పోటీ పడేలా కాంగ్రెస్ ప్రభుత్వ తయారు చేస్తుందని వివరించారు. ఇక పదేళ్లు రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓట్ల కోసం గ్రామాల కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, వచ్చినోళ్లను సలాక తీసుకొని వాతలు పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ రెండు పార్టీ ల కలిసి దోపిడి చేయడం వలనే రాష్ట్రం ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులు పాలైందన్నారు. అక్కా, చెల్లెళ్లంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.