సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-11 10:30:12.0  )
సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తమది పేదల ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం షాద్‌నగర్‌ నియోజకవర్గం కొందుర్గులో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కోందుర్గులో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(Integrated Residential Schools)కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

25 ఎకరాల విస్తీర్ణంలో స్కూల్‌ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం రూ.5వేల కోట్లతో ప్రాజెక్ట్‌‌‌కు శ్రీకారం చుట్టినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో విద్యాశాఖ(Education Department)ను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామని అన్నారు. విద్యాశాఖ బలోపేతం కోసమే కొత్త నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసమే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లుత తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed