- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: నేను ఏ హీరో ఫ్యాన్ కాదు.. నాకే ఫ్యాన్స్ ఉన్నారు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కేసు గురించి ప్రస్తావిస్తూ.. ‘మీకు ఏ హీరో అంటే ఇష్టం.. మీరు ఎవరి ఫ్యాన్ అని సీఎం రేవంత్‌ను మీడియా ప్రతినిధి అడిగారు’. దానికి సీఎం రేవంత్ స్పందిస్తూ.. ‘నేను ఎవరి అభిమానిని కాదు. నాకే అభిమానులు ఉన్నారు’ అని సరదాగా చెప్పారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అనంతరం అల్లు అర్జున్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్(Allu Arjun) థియేటర్‌కు వచ్చి ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదని అన్నారు. ముందస్తు అనుమతి లేకుండా అక్కడకు వచ్చారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేస్తే ఎందుకు చేశారు అంటారు? చేయకపోతే ఎందుకు చేయలేదు అంటారు? అందుకే మనం జోక్యం చేసుకోవద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ అన్నారు.
నేను ఏ స్టార్ హీరో ఫ్యాన్ కాదు
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2024
నేనే ఒక స్టార్‌ను నాకే ఫ్యాన్స్ ఉండాలి - రేవంత్ రెడ్డి
Video Credits - India Today pic.twitter.com/EXjeY05kPI