- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy.. శభాష్.. బాలిక ప్రాణాలు నిలబెట్టారు.. ప్రజావాణి అధికారులకు సీఎం అభినందనలు
దిశ, డైనమిక్ బ్యూరో: పేదల వాణి 'ప్రజావాణి' అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి (Praja Vani) కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందన్నారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న సైదాబాద్ కు చెందిన బిస్మిల్లా బీ (16) అనే బాలికను ఆమె కుటుంబ సభ్యులు ప్రజావాణికి తీసుకువచ్చారు. స్పందించిన అధికారులు ఆమెకు చికిత్స చేయించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం 'పేద బాలిక బిస్మిల్లా బీ ఆరోగ్య సమస్యపై సత్వరం స్పందించి, మెరుగైన వైద్యం అందింపజేసి ఆమె ప్రాణాలు నిలబెట్టిన ప్రజావాణి అధికారులకు నా అభినందనలు. బిస్మిల్లా బీ ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ…ఆమెకు, ఆమె తల్లి జూమన్ బీ కి నా శుభాకాంక్షలు'అంటూ ట్వీట్ చేశారు.
మహారాష్ట్ర చేరుకున్న సీఎం:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర (Maharashtra)లో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచార నిర్వహించబోతున్నారు. ఈ మేరకు శనివారం ఆయన నాగ్ పూర్ చేరుకున్నారు. ఇవాళ చంద్రాపూర్ ప్రచారం చేస్తారు. రాజురా, డిగ్రాస్, వార్దాలో రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఆదివారం నయాగావ్, భోకర్, షోలాపుర్‌ల్లో ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు.