CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

by Y. Venkata Narasimha Reddy |
CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు దీపావళి(Diwali) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పదేండ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని ముఖ్యమంత్రి ధీమా వెలిబుచ్చారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ఈ దీపాల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా పెద్దలందరూ పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story