- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరికొద్దిసేపట్లో సోనియాతో రేవంత్ భేటీ.. అగ్రనేతకు CM కీలక రిక్వెస్ట్..!
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం ఆరు గంటలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలతో పాటు పలు పరిపాలనాపరమైన అంశాలపైనా ఆమెకు వివరించే అవకాశమున్నది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈసారి తెలంగాణ నుంచి (నల్లగొండ లేదా ఖమ్మం జిల్లాల పరిధిలో) పోటీ చేయాల్సిందిగా రాష్ట్ర పీసీసీ తరఫున రిక్వెస్టు చేసే అవకాశమున్నది. ఒకవేళ ఆమె పోటీ చేయడానికి ఆసక్తి చూపనిపక్షంలో రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో రాజ్యసభ నుంచి పార్లమెంటు పంపడానికి రాష్ట్ర కాంగ్రెస్ ఆసక్తి చూపుతున్నదనే అంశాన్ని వివరించనున్నట్లు సమాచారం.
మొత్తం మూడు స్థానాల్లో కాంగ్రెస్‌కు రెండు గెలిచే అవకాశమున్నందున ఒకటి ఏఐసీసీకి, మరొకటి పీసీసీకి కేటాయించాలని సూత్రప్రాయంగా పార్టీ నిర్ణయం తీసుకున్నందున ఏఐసీసీ కోటా నుంచి సోనియాగాంధీకి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని ఆమెకు వివరించనున్నట్లు తెలిసింది. దీనికి తోడు పీసీసీ తరఫున ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపైనా ఆమెతో చర్చించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న రెండు గ్యారంటీల్లో మహాలక్ష్మి గ్యారంటీల్లో ఒకటైన రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ స్కీమ్ లాంచింగ్ కోసం వీలైతే సోనియాగాంధీని లేదా ప్రియాంకాగాంధీని రప్పించాలని పీసీసీ భావిస్తున్నది. దీనిపైనా ఆమెతో చర్చించే అవకాశమున్నది.
స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రియాంకాగాంధీ చేతులమీదుగా అని ఇంద్రవెల్లి సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటికే వచ్చిన 306 దరఖాస్తులు, వాటిపై రాష్ట్ర ఎన్నికల కమిటీ గాంధీభవన్‌లో బుధవారం సమావేశమై చర్చించే అంశాన్ని కూడా వివరించే అవకాశమున్నది. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సోనియాగాంధీతో సమావేశమయ్యేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.