- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ‘బీఎఫ్ఎస్ఐ’ మినీ డిగ్రీ కోర్స్ లాంఛ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ, ఇంజినీరింగ్లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాగా ఈ ప్రోగ్రామ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. మాసబ్ ట్యాంక్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బుధవారం ఉదయం 10:30 గంటలకు సీఎం ప్రారంభించనున్నారు. ఉన్నత విద్యామండలి మొత్తం 38 కాలేజీలను గుర్తించింది. అందులో 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణను అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మేలు జరిగేలా ఈ కాలేజీలను ఎంపిక చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బీఎఫ్ఎస్ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడనుంది. అత్యంత ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించనుండటం విశేషం. ఈ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణను అందుకుంటున్న 10 వేల మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ రూపొందిస్తోంది. విద్యార్థుల బయోడేటాతో పాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం వివరాలన్నీ అక్కడ పొందుపరుస్తారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పనిచేయనుంది. బీఎఫ్ఎస్ఐ కంపెనీలు ఈ పోర్టల్లో ఉన్న విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసే వీలుంటుంది. దీంతో డిగ్రీ, ఇంజినీరింగ్ లో చేరిన విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ భరోసాకు ప్రభుత్వం కొత్త బాటలు వేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సహకారంతో బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం మినీ డిగ్రీ కోర్సుకు అవసరమైన సిలబస్ ను రూపొందించింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా సీఎస్ఆర్ నిధులను సమీకరించి మూడేండ్ల పాటు ఈ శిక్షణను అందించేలా మంత్రి శ్రీధర్ బాబు బీఎఫ్ఎస్ఐ సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఎక్విప్(ఈక్యూయూఐపీపీపీ) అనే సంస్థ ఈ ప్రోగ్రాంకు రూ.2.50 కోట్లు అందించేందుకు ముందుకు వచ్చింది. విద్యార్థులకు ఉపాధి కల్పించేలా జీసీసీలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉండటంతో పాటు సీఎస్ఆర్ నిధులను సమీకరించనుంది.
ఈ కోర్సుకు ఎంపిక చేసిన కాలేజీలివే.. నాన్ ఇంజనీరింగ్ విభాగంలో 20 కాలేజీలు
01 పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ, వడ్డేపల్లి, హన్మకొండ
02 ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, ఖమ్మం
03 నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్లగొండ
04 ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, హైదరాబాద్
05 భవన్ డిగ్రీ, పీజీ కాలేజీ, హైదరాబాద్
06 ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్
07 ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట
08 ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, బేగంపేట
09 ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్
10 ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ, నాంపల్లి
11 నిజాం కాలేజీ, హైదరాబాద్
12 ఆర్బీవీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్
13 సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజీ, మెహిదీపట్నం
14 సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కాలేజీ, హైదరాబాద్
15 సెయింట్ పియస్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజీ, నాచారం
16 తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సంగారెడ్డి
17 ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, మహబూబ్నగర్
18 ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్
19 తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి
20 గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నిజామాబాద్
ఇంజనీరింగ్ విభాగంలో 18 కాలేజీలు
01 బీవీఆర్ఐటీ హైదరాబాద్ ఇంజినీరింగ్ కాలేజీ(జేఎన్టీయూ హెచ్)
02 జీ నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(జేఎన్టీయూ హెచ్)
03 గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ(జేఎన్టీయూ హెచ్)
04 జేబీ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ(జేఎన్టీయూ హెచ్)
05 జేఎన్టీయూ కూకట్పల్లి ప్రధాన క్యాంపస్(జేఎన్టీయూ హెచ్)
06 కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(జేఎన్టీయూ హెచ్)
07 మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(జేఎన్టీయూ హెచ్)
08 వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ(జేఎన్టీయూ హెచ్)
09 వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(జేఎన్టీయూ హెచ్)
10 కిట్స్ వరంగల్(కేయూ)
11 చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఓయూ)
12 మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీ(ఓయూ)
13 మాటూరి వెంకట సుబ్బారావు ఇంజినీరింగ్ కాలేజీ(ఓయూ)
14 మెథడిస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ(ఓయూ)
15 ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ(ఓయూ)
16 స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ(ఓయూ)
17 ఆర్జీయూకేటీ బాసర (ఆర్జీయూకేటీ)
18 బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్(జేఎన్టీయూ హెచ్)