తలపాగా ధరించి గుడికి సీఎం రేవంత్, భట్టి.. నాగోబా ఆలయం వద్ద సందడి

by Ramesh N |   ( Updated:2024-02-02 10:33:20.0  )
తలపాగా ధరించి గుడికి సీఎం రేవంత్, భట్టి.. నాగోబా ఆలయం వద్ద సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో సీఎం హోదాలో తొలిసారిగా అడుగుపెట్టారు. కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని మోగించేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ప్రముఖ గిరిజన దేవాలయం అయిన నాగోబా ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలోనే ఆలయ సిబ్బంది రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటికి సాంప్రదాయ గిరిజన తలపాగా కట్టారు. అనంతరం నాగోబా దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు నాగోబా గుడి గోపురాన్ని సీఎం ప్రారంభించి.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడి దర్బార్ హాల్లో కార్యక్రమం అనంతరం నాగోబా నుంచి రోడ్డు మార్గాన ఇంద్రవెల్లికి సీఎం వెళ్లనున్నారు.

Advertisement

Next Story