మరోసారి జాక్ పాట్ కొట్టిన కేకే.. రేవంత్ ప్రభుత్వంలో కీలక పదవి

by Satheesh |
మరోసారి జాక్ పాట్ కొట్టిన కేకే.. రేవంత్ ప్రభుత్వంలో కీలక పదవి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌ పార్టీలో చేరగానే నైతిక బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికైన ఎంపీ పదవికి సీనియర్ నేత కేకే రాజీనామా చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం కేకే రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రిజైన్ లెటర్‌ను రాజ్య సభ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌కర్ అందించారు. కేకే ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేకేకు కాంగ్రెస్ సముచిత గౌరవాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ రాజీనామా నిర్ణయం వెనక కేశవరావు అభిప్రాయం, దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం కారణమని వెల్లడించారు.

సీనియర్ రాజకీయ నాయకుడైనా కేశవరావును తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంకుతో కూడిన ప్రత్యేక సలహాదారుగా నియమించాలని అనుకుంటున్నట్లు రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఏది మంచో ఆయనే నిర్ణయం తీసుకుంటారని, ఆయన సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందన్నారు. కాగా, బీఆర్ఎస్‌లో కీలక హోదాల్లో పనిచేసిన కేకేకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోస్టు ఇస్తుందని పొలిటికల్ సర్కిల్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఉత్కంఠకు సీఎం రేవంత్ రెడ్డి తెరదించారు. కేకేకు కేబినెట్ ర్యాంక్‌తో కూడిన ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వాలనుకుంటున్నామని చెప్పడంతో కేకే పోస్టింగ్ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది.

Next Story

Most Viewed