- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కానిస్టేబుల్ అభ్యర్థులకు సూపర్ న్యూస్.. హైపవర్ కమిటీతో సీఎం రేవంత్ భేటీ
దిశ, వెబ్‌డెస్క్: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఇవాళ పోలీసు నియామకాలపై హైపవర్ కమిటీతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై ఈ భేటీలో కీలక చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలో పలు ఉద్యోగ నియామకపత్రాల జారీ దృష్ట్యా వేగం పెంచినట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవలే తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోలీసు నియామక మండలి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో గతేడాది అక్టోబర్ 4న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలనే ఫైనల్ చేస్తూ.. టీఎస్‌ఎల్‌పీఆర్బీ నుంచి తుది ప్రకటన వెలువడనుంది. నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ పోలీసు నియామక బోర్డు ఉన్నతాధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 కానిస్టేబుల్ పోస్టులకుగాను 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
Read More..
చట్టబద్ధమైన పాలనను సమర్థిస్తూ అంకితభావాన్ని ప్రదర్శించాలి : ఎస్పీ