రూ.10 వేల కోట్లు ఇవ్వండి.. కేంద్రమంత్రి ఖట్టర్‌కు CM రేవంత్ విజ్ఞప్తి

by Gantepaka Srikanth |
రూ.10 వేల కోట్లు ఇవ్వండి.. కేంద్రమంత్రి ఖట్టర్‌కు CM రేవంత్ విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్‌(Union Minister Manohar Lal Khattar)తో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy), ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక విజ్ఞప్తు చేశారు. పీఏఎంవై(Pradhan Mantri Awas Yojana) కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్రాలు జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మూసీ రివర్ ఫ్రంట్‌(Musi Riverfront) అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరారు. హైదరాబాద్, వరంగల్ డ్రైనేజీ స్కీంలకు నిధులు ఇవ్వాలని అడిగారు. అంతేకాదు.. పీఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు కేటాయించాలని కేంద్రమంత్రిని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణకు రూ.1.78 లక్షల కోట్ల పెట్టబడులు సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వెంట వెళ్లిన బృందాన్ని మనోహర్ లాల్ ఖట్టర్ అభినందించారు.

Next Story