- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jagadish Reddy: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్ని అబద్ధాలు చెప్పారు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు, అబద్దాలతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే అబద్దాలతో పాలన సాగిస్తోంది. రేవంత్ రెడ్డి పేరు అబద్ధానికి పర్యాయపదంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం మా మెడపై కత్తి పెట్టి రైతుల మోటార్లకు మీటర్లను పెట్టమన్నా కేసీఆర్ ఒప్పుకోలేదు. కానీ 2017 లోనే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకున్నట్లు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పి సభను ప్రజలను తప్పుదోవ పట్టించారు.
సభలో రేవంత్ రెడ్డి చదివిన పేపర్ అబద్ధం, రేవంత్ రెడ్డి చదివింది ఉదయ్ పధకానికి చెందిన పేపర్. దానిలో ఉన్న విషయాన్ని పూర్తిగా చదవకుండా.. కొద్ది భాగాన్ని మాత్రమే సభలో చెప్పారు. మీడియాలో తప్పుడు వార్తలు రాసేలా పతాక శీర్షికల్లో వచ్చేలా సీఎం రేవంత్ కుట్ర పన్నారని విమర్శించారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వం మాకు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా మేము మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని గుర్తు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులను కసాయి వాళ్లకు అప్పగించడానికి కుట్ర చేస్తున్నారన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటు వాళ్లకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని.. విమర్శించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి కుట్రలను గమనించాలని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయనతో పాటు.. మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె .వాసుదేవ రెడ్డి ఉన్నారు.