CM Revanth Reddy : అమెరికా బయలుదేరి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

by Sathputhe Rajesh |
CM Revanth Reddy : అమెరికా బయలుదేరి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోనూ ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సీఎం వెంట సీఎస్, ఐటీ, పరిశ్రమల శాఖ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సైతం వెళ్లారు. అమెరికాలో పలు నగరాల్లో సీఎం బృందం పర్యటించనుంది. ఆగస్టు4న శ్రీధర్ బాబు, 5న కోమటిరెడ్డి అమెరికా వెళ్లనున్నారు. అక్కడే సీఎం బృందంతో కలిసి పర్యటనలో పాల్గొంటారు. టూర్‌లో భాగంగా పలు కంపెనీలతో సర్కారు ఒప్పందాలు చేసుకునే చాన్స్ ఉంది.

Advertisement

Next Story